Loading. Please wait.

actress,actors gallery

UK లో కరొనా వైరస్ బారిన పడి సుమారు వెయ్యి మందికి పైగా భారతీయులు మృతి

4/27/2020
బ్రిటన్ లో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. దేశంలోని ప్రముఖ ఎపిడెమియాలజిస్టుల ప్రకారం, చాలా ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడంపై దృష్టి పెట్టడానికి ప్రభుత్వం ఆంక్షలను సడలించినట్లయితే, ఈ ఏడాది చివర్లో UK లొ 100,000 కన్నా ఎక్కువ కరోనావైరస్ మరణాలను సంభవించవచ్చు.

ఈ వైరస్ ధాటికి ఆ దేశంలో భారతీయులు వెయ్యి మందికి పైగా మృతిచెందారు. ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఆ దేశంలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 20732. అయితే ఇది అధికారికంగా వచ్చిన సమాచారం. అనధికారికంగా మరికొంతమంది ఉంటారు. ఈ లెక్కలో కూడా కొంత జిమ్మిక్కులు దాగి ఉన్నాయి. ఇళ్లల్లో మృతిచెందిన వారిని - ఇంటెన్సివ్ కేర్ లో మరణించిన వారి లెక్కలను పరిగణించడం లేదు. వీటిని కూడా కలిపితే మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు బ్రిటన్ లో మైనార్టీలుగా ఉన్న ఇతర దేశాల వారు ఎంతమంది మృతి చెందారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

వాస్తవంగా బ్రిటన్ లో భారతీయుల జనాభా 1.5 మిలియన్. బ్రిటన్ లోని ప్రధాన నగరం లండన్ లోనే అత్యధికంగా మంది భారతీయులు స్థిరపడ్డారు. భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. పెద్ద సంఖ్యలో భారతీయులు మృతి చెందుతుండడంతో అక్కడ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశంలో భారతీయ పురోహితులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీని చూస్తేనే అర్థమవుతోంది భారతీయుల మరణాల రేటు ఎలా ఉందో.  కరోనా మృతుల విషయాలను శ్మశాన వాటికలు - ఆలయాలు - గురుద్వారాలు సమాచారం ఇస్తున్నాయి.  ఈ విధంగా బ్రిటన్ లో కరోనా బారిన భారతీయులు పెద్ద సంఖ్యలో మృతిచెందడం కలవరం రేపుతోంది. బ్రిటన్ లో భారత్ తర్వాత పాకిస్తానీయులు అధికంగా ఉన్నారు. వారు కూడా ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్నారు. ఆ లెక్కలు కూడా భారీగా ఉన్నాయి.

Other news

More News

-Next--Last