Loading. Please wait.

actress,actors gallery

Tanzanian miner becomes overnight millionaire by selling rare gemstones for over $3 million

6/27/2020
టాంజానియాలో గనులు తవ్వే ఓ చిన్నపాటి మైనర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. తన జీవితంలోనే కాదు.. తన దేశంలోనే అత్యంత విలువైన గని అతడికి దొరికింది.సానినీ లేజర్‌కు రెండు పెద్ద ముడి టాంజానైట్ శిలలు దొరికాయి. రెండూ కలిపి 15 కిలోల బరువు ఉన్నాయి.ఈ విలువైన శిల భూమి మీద అత్యంత అరుదైన ఖనిజాల్లో ఒకటి. వీటిద్వారా అతడికి 34 కోట్ల డాలర్ల (సుమారు 2,566 కోట్ల రూపాయలు) ఆదాయం లభించింది.టాంజానియా గనుల మంత్రిత్వశాఖ అతడికి ఈ సొమ్ము అందించటంతో రాత్రికి రాత్రి అతడు కుబేరుడయ్యాడు.

టాంజానైట్‌కి ఇంత విలువ ఎందుకు?

టాంజానైట్ ఖనిజం కేవలం ఉత్తర టాంజానియాలో మాత్రమే దొరుకుతుంది. ఉంగరాలు, నెక్‌లెస్‌లు, బ్రేస్‌లెట్లు వంటి నగలలో ఉపయోగించే రత్నాలలో దీనికి చాలా ప్రజాదరణ ఉంది.భూమి మీద అత్యంత అరుదుగా లభించే రత్నాలలో ఇదొకటి. రాబోయే 20 ఏళ్లలో ఈ రత్నాల సరఫరా పూర్తిగా అంతరించిపోతుందని స్థానిక భౌగోళిక శాస్త్రవేత్త ఒకరు చెప్తున్నారు.ఈ విలువైన శిల ఆకర్షణ దీనిలోని ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగులు సహా విభిన్న వర్ణాల్లో ఉంటుంది.ఎంత అరుదైన శిల అనేదానిని బట్టి దీని విలువను నిర్ధారిస్తారు. శిల రంగు ఎంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది.లేజర్‌కు గత వారంలో రెండు టాంజానైట్ శిలలు దొరికాయి. ఒక దాని బరువు 9.2 కిలోలు ఉంటే, మరొకటి 5.8 కిలోల బరువు ఉంది. వాటిని బుధవారం నాడు మాన్యారా ప్రాంతంలో వాణిజ్య కార్యక్రమం సందర్భంగా విక్రయించారు

Other news

More News

-Next--Last