Loading. Please wait.

actress,actors gallery

30 ఏళ్ల కనిష్టానికి బంగారం పతనం!

4/16/2020
పసిడి వెలవెలబోతోంది. డిమాండ్ సగానికి పైగా పడిపోనుంది. COVID-19 వల్ల నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులు సహా బంగారం ధర పరుగులు పెట్టడంతో బంగారం కొనే వారు కరువయ్యారు.

బంగారం ధర మాత్రం పరుగులు పెడుతోంది. కానీ డిమాండ్ మాత్రం గణనీయంగా పడిపోతూ వస్తోంది. భారత్‌లో బంగారం వినియోగం 2020లో ఏకంగా 50 శాతం తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బంగారం డిమాండ్ ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోనుంది. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా జువెలరీ షాపులు బంద్ కావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమైన పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారు షాపులు క్లోజ్ కావడం కూడా ఇందుకు కారణంగా నిలవొచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర ర్యాలీ చేస్తూ వస్తోంది. ఏడేళ్ల గరిష్టాన్ని తాకింది. దీంతో మన దేశంలోనూ పసిడి పరుగులు పెడుతూనే ఉంది. దీంతో బంగారం వినియోగంపై ప్రతికూల ప్రభావం పడింది. కరోనా వైరస్ సహా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధర పెరుగుదలకు కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో బంగారం కొనే వారు కరువయ్యారు.

‘బంగారం డిమాడ్ ఈ స్థాయిలో పడిపోతుందని అస్సలు ఊహించలేదు. లాక్ డౌన్ కాలంలో అమ్మకాలు జీరో’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాబన్ తెలిపారు. భారత్‌లో బంగారం వినియోగం ఈ ఏడాది 350 టన్నులకు పడిపోవచ్చని అంచనా వేశారు. 1991 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి అని పేర్కొన్నారు. 2019లో బంగారం వినియోగం 690 టన్నులుగా ఉంది.ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరుగుదలతో రూ.45,970కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.140 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.42,100కు ఎగసింది. బంగారం ధర 8 రోజుల్లో రూ.2170 పెరిగింది.

పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.40 పెరిగింది. దీంతో వెండి ధర రూ.41,890కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Other news

More News

-Next--Last