Loading. Please wait.

actress,actors gallery

200 పందులను సజీవంగా పూడ్చేశారు.

6/10/2020
సంవ‌త్స‌రం అంతా పండించిన పంట‌ను పందులు నాశనం చేస్తున్నాయి. అవి రాకుండా ఉండ‌టానికి ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా సక్సెస్ అవ్వ‌డం లేదు. దీంతో రైతులు పంచాయతీ అధికారుల ముందు స‌మస్య‌ను ఏక‌రువు పెట్టారు. దీంతో అధికారులు 200 పందుల‌ను స‌జీవంగా గుంట‌తీసి పూడ్చివేశారు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే…హవేరి జిల్లాలోని హిరెకెరూరు సిటీ ప‌రిస‌ర ప్రాంతాల‌లోని రైతులను పందులు ప్ర‌శాంతంగా బ్ర‌తుక‌నివ్వ‌డం లేదు. పంట‌లు కాపు ద‌శ‌లో ఉన్న‌ప్పుడు మంద‌లుగా దాడి చేసి నాశనం చేస్తున్నాయి. వాటిని రాకుండా క‌ట్ట‌డి చేసేందుకు వివిధ ప్ర‌య‌త్నాలు చేసి విసిగి వేసారిన రైతులు..పంచాయ‌తీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో అధికారులు పందుల య‌జ‌మానుల‌కు వార్నింగ్ ఇచ్చి..వాటిని పొలాల్లోకి వెళ్ల‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని కోరారు. కానీ వారు హెచ్చ‌రిక‌ను లెక్క‌చెయ్య‌లేదు. దీంతో ఆగ్ర‌హించిన అధికారులు..పెద్ద గుంత‌ను తవ్వి, 200 పందుల‌ను పూడ్చివేయించారు.

Related news

More News

-Next--Last