Loading. Please wait.

actress,actors gallery

1993లో ముంబయిలో సంభవించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమన్ మృతి

6/26/2020
1993లో ముంబయిలో సంభవించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమన్(54) మరణించాడు. గుండెపోటు రావడంతో ఈ ఉదయం యూసుఫ్ మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. స్థానిక సమాచారం ప్రకారం ఈ ఉదయం 10 గంటల సమయంలో బ్రష్ చేసుకునే సమయంలో యూసుఫ్ స్పృహ తప్పి పడిపోగా.. వెంటనే నాశిన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యూసుఫ్ మరణించాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ధూలే మెడికల్ కాలేజీకి పంపారు. కాగా ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు టైగర్ మెమన్‌కి యూసుఫ్ సోదరుడు. ఈ కేసులో యూసుఫ్‌ దోషిగా తేలడంతో.. కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ నేపథ్యంలో 2018 జూలై 26 నుంచి యూసుఫ్‌ జైలులో ఉండగా.. టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు.

Other news

More News

-Next--Last