Loading. Please wait.

actress,actors gallery

హిమాలయన్ వయాగ్రా (Himalayan Viagra) తో అంగ స్తంభన సమస్యలు మటుమాయం..కాని రేటు.కిలో 70లక్షలు

5/30/2020
123
హిమాలయన్ వయాగ్రా అని పిలిచే కాటర్‌పిల్లర్ (గొంగళి పురుగు) ఫంగస్‌కు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.యర్సగుంబా అని కూడా పిలిచే ఈ ఔషధం అంగ స్తంభ సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతారు.ఈ ఔషధం కిలో ధర రూ.70 లక్షల వరకు పలుకుతోంది.

ఈ గొంగళి పురుగులను ‘యర్సగుంబు’ అని అంటారు. టిబెట్ భాషలో ‘చలికాలం పురుగు’ లేదా ‘వేసవి గడ్డి’ అని అర్థం. ఇవి కేవలం హిమాలయాల్లో మాత్రమే లభ్యమవుతాయి. అందుకే వీటిని ‘హిమాలయన్ వయాగ్రా’ అని పిలుస్తారు. సముద్రమట్టానికి సుమారు 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో జీవించే కీడా జాడీ అనే గొంగళి పురుగులు నేలపై పాకే సమయంలో ఫంగస్‌కు గురవ్వుతాయి. భూమిలోకి కూరుకుపోయి చనిపోతాయి. అవి క్రమేనా ‘యర్సగుంబు’గా మారతాయి. అయితే, వీటిని సేకరించడమంటే మాటలు కాదు. ప్రాణాలకు తెగించి ఎత్తైన పర్వతాలపై అన్వేషించాలి.

భారత్‌తోపాటు నేపాల్, టిబెట్, భూటాన్‌లలోని హిమాలయ ప్రాంతాల్లో ఇది లభ్యం అవుతుంది. చాలా సమస్యలను పరిష్కరించే సహజ ఔషధం కావడంతో అంతర్జాతీయంగా దీనికి భారీ డిమాండ్ ఉంది.  దీంతో మే, జూన్ నెలల్లో ఈ ఔషధాన్ని సేకరించడానికి ప్రజలు పర్వతాలపైకి వెళతారు.

సమస్యలను పరిష్కరించే ఈ ఔషధం హిమాలయాలకు చెందిందని కదూ. మీరు ఊహించింది నిజమే. కీడా జాడీ, యర్సగుంబా అని పిలిచే ఈ కాటర్ పిల్లర్ ఫంగస్ హిమాలయ పర్వత సానువుల్లో లభిస్తుంది. గొంగళి పురుగుకు నేలలో ఉండే ఫంగస్ సోకి, అది చనిపోయాక యర్సగుంబాగా మారుతుంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు పది వేల అడుగుల ఎత్తులో పెరుగుతుంది.

ఈ హిమాలయన్ వయాగ్రా వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తేనీరుగా, సూపులలో కలిపి తాగుతుంటారు. అంగ స్తంభన సమస్యలు, డయాబెటిస్, దగ్గు, జలుబు, కామెర్లు, ఆస్తమా, క్యాన్సర్‌ ఇలా రకరకాల జబ్బులను ఈ ఫంగస్ తగ్గిస్తుంది. ప్రపంచంలోని అత్యంత విలువైన జీవ పదార్థాల్లో ఒకటిగా పేరొందిన హిమాలయన్ వయాగ్రా లభ్యత వాతావరణ మార్పుల కారణంగా క్రమంగా తగ్గుతోంది.

ఇది కేవలం వయాగ్రా మాత్రమే కాదు..:

‘హిమాలయన్ వయాగ్రా’గా పేరొందటం వల్ల వీటిని కేవలం నపుంసకత్వం, అంగస్తంభన సమస్యలను దూరం చేసే ఔషదంగానే భావిస్తారు. అయితే, ఇది క్యాన్సర్, ఆస్తమా, డయాబెటిస్, దగ్గు, జలుబు, కామెర్లను తగ్గిస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా ఔషదాల తయారీలో ఉపయోగిస్తున్నారు. కొందరు వీటిని నేరుగా టీ, సూప్‌లలో కలుపుకుని తాగేస్తుంటారు. ఒక గ్రాము యర్సగుంబు విలువ సుమారు రూ.7 వేలు ఉంటుంది.

సెక్స్ సామర్ధ్యం తగ్గిపోవడమన్నది ఈ రోజుల్లో కామన్ విషయం. పని ఒత్తిళ్లు, టెన్షన్లు ఇలా ఎన్నో కారణాలు... పటుత్వాన్ని తగ్గిస్తున్నాయి. ఐతే... హిమాలయాల్లో ఓ అరుదైన మొక్క (యర్సాగుంబా) సెక్స్ సామర్ధ్యాన్ని అమాంతం పెంచుతోంది. అసలా మొక్క పుట్టుకే విచిత్రం. హిమాలయాల్లో తిరిగే ఒక జాతి గొంగళిపురుగులకు ఫంగస్ వ్యాపిస్తుంది. ఆ ఫంగస్ గొంగళి పురుగును తినేస్తూ... మొక్కగా ఎదుగుతుంది. ఈ ప్రక్రియ జరిగేందుకు 9 నెలలు పడుతుంది. ఈ మొక్కల్ని సేకరించే అక్కడి ప్రజలు వాటిని ఎండబెడుతున్నారు. అలా ఎండిన యర్సాగుంబాను తిన్నా, దాన్ని పొడిచేసుకొని తిన్నా, దాన్ని వంటల్లో వేసుకొని తిన్నా సెక్స్ సామర్ధ్యం బోల్డంత పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఆన్‌లైన్‌లో దొరుగుతున్న ఈ యర్సాగుంబా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకపోవడం విశేషం.

శృంగార సామర్ధ్యం తక్కువగా వున్నవారికి అదిరిపోయే ఆయుర్వేద ఔషధంగా యర్సాగుంబా పనికొస్తోంది. ఎక్కువగా నేపాల్‌లో దొరికే ఓ ఔషధ మూలిక శృంగార సామర్ధ్యాన్ని విశేషంగా పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నిజానికి యర్సాగుంబా అంత ఈజీగా దొరకదు. దాని కోసం నేపాలీలు పర్వతాలపై ఉదయం నుంచీ సాయంత్రం వరకూ వెతుకుతారు. అలా వెతికితే... ఒక్కో వ్యక్తికీ రోజుకి ఒకటీ లేదా రెండు మాత్రమే దొరుకుతాయి. అందుకే వాటి ధర బంగారం కంటే ఎక్కువగా ఉంది.

ఈ సహజ సిద్ధ వయాగ్రా గొప్పదనాన్ని తెలుసుకున్న చైనా... యర్సాగుంబాలను తెగ వాడేస్తోంది. వంటల్లో పొడి రూపంలో వేస్తున్నారు. చైనా తర్వాత ఇండియా, అమెరికా, యూరప్ దేశాలు దీన్ని ఎక్కువగా వాడుతున్నాయి. ఇది లైంగిక కోరికలు పెంచడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని తేలింది. అందుకే దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ వుంది.

Other news

More News

-Next--Last