Loading. Please wait.

actress,actors gallery

హిందూ దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేసినందుకు ముస్లిం మహిళలకు, హిందూ దుకాణాలలొ కొనవద్దు అని ,ముస్లిం యువకుల బెదిరింపు.

Posted by: Vashishtha On 5/19/2020
దావణగెరెలో బుర్ఖా ధరించిన ఇద్దరు ముస్లిం మహిళలు ఓ షాపులో బట్టలు కొనుగోలు చేశారు. అయితే అది హిందువుల షాపు కావడంతో అక్కడే ఉన్న కొందరు ముస్లింలు వారిని అడ్డగించి నోటికొచ్చిన విధంగా తిట్టారు. బట్టలు తీసుకొస్తోన్న సంచులను వారి చేతుల్లో నుంచి బలవంతంగా లాక్కుని దౌర్జన్యం చేశారు. ఏవైనా కొనాలనుకుంటే ముస్లింల షాపులకు వెళ్లాలి కానీ హిందువుల దుకాణంలో కొనడమేంట’ని వారిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు.

తక్షణమే ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు తెగబడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై బీజేపీ సీనియర్ లీడర్ శోభా తీవ్రంగా ఫైరయ్యారు. “అది కర్ణాటకా లేకా ఇతర ఇస్లామిక్ కంట్రీనా? హిందువుల షాపులో కొన్నందుకు ఆ దుండగులు ముస్లిం మహిళలను అవహేళన చేస్తారా? ఇలా మతపిచ్చి పట్టిన తీవ్ర వాదులకు భారత చట్టాల రుచి చూపించాలి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.

Other news

More News

-Next--Last