Loading. Please wait.

actress,actors gallery

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో ఎనిమిది మంది మరణం

5/6/2020
 విశాఖ గ్యాస్ లీక్   ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది  ప్రాణాలు విడిచారు.. 
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమలో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది.  పరిశ్రమ నుంచి లీక్ అయిన రసాయన వాయువు 5 కి.మీల మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు కళ్లలో మంటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు.గ్యాస్ లీక్ అయ్యి అది పీల్చి చాలా మంది అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయారు. వీరిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రజలు తీవ్ర భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటివరకు 8మంది చనిపోయారు. 1000 మంది సీరియస్ గా ఉన్నారు.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు, అధికారులు చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. కేజీహెచ్ బాధితులతో నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
పరిశ్రమ చుట్టుపక్కల వందలాదిమంది అస్వస్థతకు గురికాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రాత్రివేళ ప్రమాదం జరగడంతో జనాలు చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, స్థానిక యువత తలుపులు పగలగొట్టి బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు అందించడానికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థత గురవ్వగా.. వారిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు.. ఘటనను పరిశీలించడానికి వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు.

Other news

More News

-Next--Last