Loading. Please wait.

actress,actors gallery

మూడవ దశలొ లాక్డౌన్ లొ సడలింపులు

5/1/2020
కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన కేంద్రం... వాటిలో మాత్రం సడలింపులకు ససేమిరా అన్నది. అదే సమయంలో కరోనా వ్యాప్తి ఓ మోస్తరుగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా - అసలు కరోనా కేసులు లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. ఆరెంజ్ జోన్లలో ఓ మోస్తరు సడలింపులను ప్రకటించిన కేంద్రం... గ్రీన్ జోన్లలో మాత్రం దాదాపుగా అన్ని కార్యకలాపాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మూడో దశ లాక్ డౌన్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నా... కొత్తగా ప్రకటించిన సడలింపులను మాత్రం శనివారం నుంచే అమల్లోకి తెచ్చేసింది.  సడలింపులు ఈ కింది విధంగా ఉప్నాయి.

సడలింపుల వేళా... ఈ క్రింది వాటిపై పూర్తిగా నిషేధం

 • విమానాలు - రైళ్లు - అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
 • స్కూళ్లు - కాలేజీలు - కోచింగ్ సెంటర్లు బంద్
 • హోటళ్లు - రెస్టారెంట్లు - సినిమా హాళ్లు - జిమ్ లు బంద్
 • స్విమ్మింగ్ పూల్స్ - స్టేడియంలు మూసి ఉంచాలి
 • అన్ని ప్రార్థనా స్థలాలు - పబ్లిక్ ఈవెంట్లు రద్దు
 • అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి

గ్రీన్ జోన్లు - ఆరేంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు

 •  రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు
 •  వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన
 •  కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు
 •  గ్రీన్ - ఆరేంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి
 •  రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
 •  50 ఆక్యుపెన్సీతో బస్సులు తిప్పుకునేందుకు అనుమతి
 •  గ్రీన్ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
 •  ఆరేంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
 •  ఆరేంజ్ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
 •  ఆరేంజ్ జోన్లు: టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి
 • ఆరేంజ్ - గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
 •  గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్
 •  బహిరంగా ప్రదేశాల్లో మాస్కులు - భౌతికదూరం తప్పనిసరి

Other news

More News

-Next--Last