Loading. Please wait.

actress,actors gallery

మరో తెరాస ఎమ్మెల్యే బిగాల గణేష్ కు కరోనా పాజిటివ్.

6/15/2020
మొన్న తెరాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ,నిన్న నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఈరోజు నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే  బిగాల గణేష్  వరుసగా ప్రజాప్రతినిధులను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. తెలంగాణలో కరోనా రక్కసి తీవ్ర స్థాయిలో ప్రబలుతోంది.ఇదిలా ఉండగా ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా రావడంతో నిజామాబాద్ అధికారులు అప్రమతం అయ్యారు. బాజిరెడ్డితో ఎవరెవరు కాంటాక్ట్ ఉన్నారో వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు.  ఎమ్మెల్యే బాజిరెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఓపెనింగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.  అక్కడ ఎవరెవర్ని కలిశారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కరోనా సోకి 24 గంటలకు కూడా కాకముందే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేతో అర్బన్ ఎమ్మెల్యే కాంటాక్ట్ లో ఉండటం వలన ఆయనకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది.  ఇక ఎమ్మెల్యే గణేష్ గుప్తాలో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు అనే విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు. 

Related news

More News

-Next--Last