Loading. Please wait.

actress,actors gallery

మరోసారి లాక్ డౌన్ కానున్న హైదరాబాద్ , సికింద్రాబాద్

6/25/2020
భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పలు మార్కెట్లు మరోసారి లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఈ గురువారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్ మూసివేస్తున్న‌ట్టు వ్యాపారులు ప్ర‌క‌టించారు. తాజాగా బేగంబజార్ మార్కెట్ ను కూడా మూసివేయాలని హైద్రాబాద్ కిరాణ వ్యాపారుల అసోసియేషన్ నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీ ఆదివారం నుంచి 8 రోజులపాటు బేగంబజార్ లోని దుకాణాలను మూసివేస్తున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.
హైదరాబాద్ లో లాక్ డౌన్ సడలింపులతో జనం విపరీతంగా రోడ్డెక్కారు. దీంతో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా దుకాణాల వద్ద రద్దీని తగ్గించుకోవాలని వ్యాపారులు భావించారు. ఇందులో భాగంగా ఆదివారం నుంచి మరి కొన్నిరోజులపాటు మార్కెట్లు బంద్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నామ‌ని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. నగరంలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ఈ నిర్ణ‌యం తీసుకోక తప్పలేదన్నారు.

Other news

More News

-Next--Last