Loading. Please wait.

actress,actors gallery

భారత్ లొ 70 శాతం కంపెనీలు, ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించేందుకు సిద్ధమవుతున్నారు

5/15/2020
 లాక్ డౌన్ కారణంగా, ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు హుష్ కాకి అవుతున్నాయి .ఐతే ఇటువంటి విపత్కర పరిస్తితుల్లొ సర్వేలు షాకింగ్ నిజాలు బయట పెట్టాయీ...
మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్ ,సర్కారీ నౌకరి.ఇన్ఫో సంస్థలు సంయుక్తంగా మే 1 నుంచి 10వ తేదీ వరకు ఈ సర్వే చేపట్టగా .ఈ సర్వే లో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 11 రంగాలకు చెందిన 1124 కంపెనీలూ పాల్గొన్నాయి. ఈ సర్వే ఫలితాలను బట్టి ..దాదాపు 70 శాతం కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించేందుకు సిద్ధమవుతున్నారట.  57% యజమానులు  తాత్కాలికంగా ఉద్యోగాలు తీసేస్తామని 21% శాతం మంది రెండేళ్ల పాటు శాశ్వతంగా ఉద్యోగాలు తీసేస్తామని వెల్లడించాయి. అయితే 32 శాతం కంపెనీలు వేతనాలు ఉద్యోగాల్లో  కోతలు విధించడం లేదని వెల్లడించాయి.

కరొనా  మహమ్మారి వల్ల అన్ని పరిశ్రమలు బాదను అనుభవిస్తున్నాయి. దీనితో  ప్రతి స్థాయిలో కోతల రూపంలో అది వ్యక్తమవుతుంది.  ఈ తాత్కాలిక సంక్షోభం నుంచి కంపెనీలు కొత్త ఉద్యోగాల సృష్టి మొదలు అవుతుంది అని మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్ సర్కారీ నౌకరి సీఈవో రాజేష్ కుమార్ తెలిపారు. ఈ లాక్ డౌన్ సమయంలో వైమానిక ఆతిధ్య రవాణా ఎఫ్.ఎన్.సి.జి ..ఆటో మొబైల్ తయారీ రంగాలు ఎక్కువ ప్రభావం చెందాయని ఈ రంగాలు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు.

Recent news

More News

-Next--Last