Loading. Please wait.

actress,actors gallery

ప్రపంచవ్యాప్తంగా 1 కోటికి చేరువలో Covid-19 కేసులు

6/25/2020
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 94 లక్షల కేసులు నమోదు కాగా 50.65 లక్షల మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇక 56.70శాతం రికవరీ రేటుతో భారత్‌ అత్యంత సురక్షితమైన స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 95,33,141కి చేరాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,85,122కి చేరింది. ఇక ప్రస్తుతం 38,68,982 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 51,79,037 గా ఉంది. ఇక అమెరికా, బ్రెజిల్‌లో కరోనా వైరస్ జోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరోసారి బాగా పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో 12,97,668 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే బ్రెజిల్‌లో 4,88,692 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Other news

More News

-Next--Last