Loading. Please wait.

actress,actors gallery

దేశ వ్యాప్తంగ ఒక్క రోజులో సుమారు 20 వేల Covid-19 కేసులు

6/28/2020
ఇండియాలో కేవలం ఒక్క రోజులో సుమారు 20 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 19,906 కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,28,859 కి చేరగా.. ఒక్క రోజులో 410 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇప్పటివరకు ఈ వైరస్ తో మరణించిన వారి సంఖ్య 16,095 కి పెరిగింది. ప్రపంచ దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తరువాత ఇండియా ఈ కేసుల విషయంలో నాలుగో స్థానంలో చేరింది. కాగా 2,0.051 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, 3,09,712 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్య శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఏపీ, తెలంగాణ, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 87 శాతం కేసులు నమోదయ్యాయి. కరోనా రోగులు తక్కువ ధరకే లభ్యమయ్యే డెక్రామీథోసోన్ స్టెరాయిడ్ ని తీసుకోవచ్ఛునని ప్రభుత్వం అనుమతించింది. అయితే సాధారణ, విషమ స్థితిలో ఉన్న రోగులకే దీన్ని అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది.

Other news

More News

-Next--Last