Loading. Please wait.

actress,actors gallery

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరొనా కేసుల నమోదు

6/13/2020
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శనివారం నాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 253 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య4737కి చేరింది. వీటిలో 449 వలస దారులవి ఉన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ ద్వారా విడుదల చేసింది. శనివారం నాడు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే అత్యధికంగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సంగారెడ్డిలో 24, మేడ్చల్ 14,రంగారెడ్డి 11, మహబూబ్‌నగర్‌4, వరంగల్‌ రూరల్‌ 2,అర్బన్ 2,కరీంనగర్ 2,నల్గొండ 2, ములుగు 2, సిరిసిల్లా 2, మంచిర్యాల 2, సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్‌ కర్నూల్‌, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు 2352 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2203 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Related news

More News

-Next--Last