Loading. Please wait.

actress,actors gallery

ఢిల్లీ లో జరిగిన తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి వలన ,నరసరావుపేటలో 104 మందికి కరొనా సొకింది.

4/30/2020
ఈ మద్య  ఒక్కసారిగా నరసరావుపేటలోపదుల సంఖ్యలో కరొనా  కేసులు నమోదవడం ...ఆ కేసుల సంఖ్య అంచెలంచెలుగా 104కు చేరుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో నరసరావుపేటలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. పేటలో కరోనా ఈ స్థాయిలో వ్యాపించడం వెనుక కారణాలేమిటన్న అంశంపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. చివరకు నరసరావుపేటలో కరోనా కేసులకు ఓ టీస్టాల్ హాట్ స్పాట్ లా మారిందని గుర్తించారు. నరసరావుపేటలో లాక్ డౌన్ మొదలైన రోజే,నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తి తన టీ స్టాల్ తెరిచాడు. ఆ టీస్టాల్ లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన హాట్ స్పాట్ `ఢిల్లీ తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి టీ తాగాడు.ఆ టీ స్టాల్లొ తర్వాత ఎవరైతే టీ తాగారో వారి ద్వారా .కరోనా వైరస్ తుపానులా మారి నరసరావుపేటను చుట్టుముట్టింది. వారిద్దరితోపాటు అక్కడే టీ తాగిన మరొకరికి కూడా కరోనా వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. అతడు చనిపోయిన తరువాతే అతడికి కరోనా ఉందని నిర్థారణ అయ్యింది. అతడి ద్వారా కాంటాక్ట్లో ఉన్న కుటుంబసభ్యులు ఇరుగుపొరుగున ఉన్న మరికొందరికి కరోనా సోకింది. ఇలా నరసరావుపేటలో కేసులు 104కు చేరుకున్నాయని పోలీసులు తేల్చారు. నరసరావుపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ కొందరికి కరోనా సోకడంతో... అక్కడ అనేక గ్రామాలు రెడ్ జోన్లో ఉన్నాయి. 

Other news

More News

-Next--Last