Loading. Please wait.

actress,actors gallery

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్..

6/13/2020
 టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనావైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. జనగామ నియోజకవర్గం  నుంచి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అవడం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. తెలంగాణలో ఎమ్మెల్యేల్లో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు. ఇదివరకు బీజేపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి వంటి వారికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వారిలో మాత్రం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిదే కరోనావైరస్ బారిన పడిన మొట్టమొదటి ఎమ్మెల్యే కేసుగా పరిగణించాల్సి ఉంటుంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే  మే 29న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,కేసీఆర్ ను కలిసారు.!

Related news

More News

-Next--Last