Loading. Please wait.

actress,actors gallery

కోవిడ్ -19 లక్షణాల జాబితాలో " ( Anosmia) ఆహారాన్ని రుచి చూసే సామర్ధ్యం మరియు వాసన పసిగట్టే సామర్థ్యాన్నికోల్పోవడం"

6/15/2020
కోవిడ్ -19 సంక్రమణ యొక్క లక్షణాలు జ్వరం, దగ్గు, అలసట, శ్వాస ఆడకపోవడం, expectoration(శరీర బరువు తగ్గడం, రాత్రుల్లొ చెమట పట్టడం,అలసట,ఆకలి కోల్పోవడం,మెడ మీద నొప్పి ), మయాల్జియా (Pain in muscles),రినోరియా (Runny nose),గొంతు నొప్పి మరియు విరోచనాలు.

United States’ Centers for Disease Control and Prevention ఏప్రిల్‌లో  కోవిడ్ -19 లక్షణాల జాబితాలో  " ( Anosmia) ఆహారాన్ని రుచి చూసే సామర్ధ్యం మరియు  వాసన పసిగట్టే సామర్థ్యాన్నికోల్పోవడం"  చేర్చడం  జరిగింది.

భారతదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం  ఈ వ్యాధి యొక్క సంకేతాలు వ్యక్తికి వ్యక్తికి మారుతుంటాయి. "ముఖ్యంగా వృద్ధులు మరియు రోగనిరోధక శక్తిని అణచివేసిన రోగులు అలసట, తగ్గిన అప్రమత్తత, తగ్గిన చైతన్యం, విరేచనాలు, ఆకలి లేకపోవడం, మతిమరుపు మరియు జ్వరం లేకపోవడం వంటి విలక్షణమైన లక్షణాలతో ఉండవచ్చు" అని తెలిపింది. 

"కోవిడ్ 19 (n = 15,366) కొరకు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ / ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ పోర్టల్ కేసు దర్యాప్తు ఫారాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నివేదించబడిన సంకేతాలు మరియు లక్షణాల వివరాలు, జ్వరం (27%), దగ్గు (21%), గొంతు నొప్పి (10%), ఊపిరి  (8%), బలహీనత (7%), runny nose (3%) మరియు ఇతరులు 24%, ”అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జూన్ 11 నాటికి ఈ గణాంకాలు నమోదు చేయబడ్డాయి.

Related news

More News

-Next--Last