Loading. Please wait.

actress,actors gallery

కరోనా వైరస్ తో శవాల దిబ్బగా మారిన న్యూయార్క్

4/10/2020
అమెరికాలోన  కనీసం 16,700 మంది కరోనావైరస్ కారణంగా మరణించారు - వారిలో సగం మంది న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్నారు.న్యూయార్క్ కరోనాతో శవాలదిబ్బగా మారిపోతోంది.. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 466,390 కి పైగా కేసులు నిర్ధారించబడ్డాయి, సుమారు 162,000 న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్నాయి. 

న్యూయార్క్ లో రోజుకు 1500 మందికిపైగా మరణాలు సంభవిస్తుండడంతో సాధారణ శ్మశనావాటికలు అంత్యక్రియలు నిర్వహించే వ్యవస్థలు నిండిపోయాయి. దీంతో శవాలను ఖననం చేసే వీలులేక ఏం చేయాలో పాలుపోక మార్చురీలలో శవాలను భద్రపరుస్తున్న దుస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు - బంధువులు కూడా శవాలను తీసుకుపోవడం లేదు.. చూడడం లేదు. దీంతో ప్రభుత్వమే  మృతదేహాలను తెలుపురంగు బాక్సుల్లో ఒకదానిపై ఒకటి పేర్చి అంత్యక్రియలు నిర్వహిస్తోంది.

న్యూయార్క్ నగరంలో మృతదేహాలను పూడ్చిపెట్టడానికి స్థలం లేకపోవడంతో దగ్గరలోని హార్ట్ ఐలాండ్ లో సామూహిక ఖననం చేస్తున్నారు. క్రేన్లతో శవాలను తీసుకెళ్లి పెద్ద గుంతలు తవ్వి వారిని అలాగే భూమిలో పాతిపెడుతున్నారు. ఇలా న్యూయార్క్ లో శవాలను ఖననం చేయడానికి కూడా స్థలం లేక ఐలాండ్ లో ఖననం చేస్తున్న దారుణ స్థితి నెలకొంది.

Other news

More News

-Next--Last