Loading. Please wait.

actress,actors gallery

కరోనా వైరస్ కి ఔషధాన్ని విడుదల చేసిన భారత ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్. ఫాబిబ్లూ పేరిట మార్కెట్ లోకి

6/20/2020
ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ కి మందు వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే, దీనికి సంబంధించి అనుమతులను కూడా భారత ఔషధ నియంత్రణ మండలి శుక్రవారం రోజున విడుదల చేసింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదంతో కరోనా వైరస్ కి ఔషధాన్ని విడుదల చేసిన భారత ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్. ఫాబిబ్లూ పేరిట మార్కెట్ లోకి రానున్న ఈ మందు స్వల్ప, మధ్యస్థ స్టేజ్ లో కరోనాతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం వెంటిలేటర్స్ పై సీరియస్ స్టేజ్ లో ఉన్న వారికి పూర్తి స్థాయిలో పనిచేయక పోవచ్చనేది ట్విస్ట్. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్ ఔషదాలపై లోతైన పరిశోధన చేసిన ఈ సంస్థ మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ లో విజయం సాధించాక ఆమోదానికి పంపింది.

నోటిద్వారా మాత్రల రూపంలో వేసుకునేలా టాబ్లెట్ ని రూపొందించింది. పక్కాగా వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కో మాత్ర ధర రూ.103 అని చెప్పింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా వారు తొలిరోజు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రెండు సార్లు వేసుకోవాలి, ఆ తర్వాత 14 రోజుల పాటు 800 ఎంజీ డోస్ ఉన్న మాత్రలను రోజుకు రెండుసార్లు వేసుకోవాలని కంపెనీ అధికారులు సూచించారు. మధుమేహ, హృద్రోగ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఈ మందు పనిచేస్తుందని తెలిపారు. రోజుకి 15 వేల కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజలకి ఇదొక శుభవార్త అని చెప్పాలి.

Other news

More News

-Next--Last