Loading. Please wait.

actress,actors gallery

కరోనా బాధితుల్లో మరో ‘మూడు’ కొత్త లక్షణాలు

6/28/2020
కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తేల్చారు. అటు గొంతు మంట. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అని ఈ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఈ లక్షణాలన్నీ కూడా వైరస్ సోకిన 2-14 రోజుల్లోగా కనిపిస్తాయని సంస్థ పేర్కొంది.

Other news

More News

-Next--Last