Loading. Please wait.

actress,actors gallery

కరొనా వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులొకి రావడానికి ఇంకా రెండు ఏళ్లు పడుతుంది .

Posted by: Vashishtha On 5/11/2020
మానవ జనాభాలో 60-70శాతం మంది కరోనా వైరస్ బారిన పడుతారని.. వ్యాక్సిన్ రావడానికి మరో 18-24 నెలల సమయం పట్టవచ్చని.. అప్పటివరకు కరోనాను ఎదుర్కొక తప్పదని జాన్ హ్యాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిషాయ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం తప్పితే ప్రస్తుతానికి కరోనాను ఏమీ చేయలేమని ఆయన కుండబద్దలు కొట్టారు.ఇపుడు కరొనా వైరస్ కి వ్యాక్సిన్ కనుకున్న Exploratory Stage, Pre-Clinical Stage,Phase-I Vaccine Trials,Phase-II Vaccine Trials,Phase-III Vaccine Trials etc అయ్యే వరకు ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాలు పడుతుంది.అప్పటికి ప్రజలకు వ్యాక్సిన్  అందుబాటులొకి వస్తుందని శాస్త్రవేత్తలు ఖచ్చితంగ చెప్పలేక పొతున్నారు.  ఒకవేళ వచ్చినా పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందా? అంటే సందేహమే. మరి.. అన్ని రోజులు ఇళ్లల్లో  కూర్చోలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏం చేయాలన్నదే ముందున్న ప్రశ్న. ఎవరికి వారుగా జాగ్రత్తగా ఉంటూ.. బతుకు బండిని లాగటం తప్పించి మరో మార్గం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే..వ్యాధి  మన దగ్గరకు రాకుండా అప్రమత్తంగా ఉండాలి.

అన్ని రోగాలకు టీకాలు సాధ్యమేనా? అన్న ప్రశ్నకు నో అనే సమాధానమే వస్తుంది.ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన HIV కి రెండేళ్లలో మందు వచ్చేస్తుందని చెప్పారు. ఇప్పటికి ఆ  దిక్కుమాలిన రోగం  వచ్చి 36 ఏళ్లు అయ్యింది. ఇప్పటికి హెచ్ఐవీకి వ్యాక్సిన్ లేదన్నది మర్చిపోకూడదు. ఆ మాటకు వస్తే Dengue, Rhinovirus లకు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ లేదు. ఇదంతా ఎందుకంటే.. వ్యాక్సిన్ సిద్ధం చేయటం చెప్పినంత సులువు కాదని చెప్పేందుకే.
ఇలాంటి వేళ కరొనా వైరస్ కి వ్యాక్సిన్ కనుక్కొపొతే ,జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవటమే కాదు.. ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎవరికి వారు.. తమకు రోగ లక్షణాలు కనిపించినంతనే ముడుచుకు పోవటం.. ఇంట్లోనే ఉండిపోవటం లాంటి వాటితో సదరు వ్యక్తికే కాదు.. వారి కుటుంబ సభ్యులకు.. వారి సన్నిహితులకు ముప్పుగా మారుతుందన్నది మర్చిపోకూడదు. ఏ మాత్రం అనుమానం ఉన్నా.. తమకు తాముగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు.. ఏది పడితే అది తాకేయటం.. గతంలో మాదిరి జీవన విధానానికి కాస్త భిన్నంగా ఉండాల్సి వస్తుంది. 

ఎలా అంటే ఈ క్రింది విధంగ 

. విదేశి ప్రయణాలు ఒక రెండు సంవత్సరాల పాటు వాయిదా వేయడం ..

. ఒక సంవత్సరం పాటు హోటల్స్,రెస్టారంట్స్ లొ తినక పొవడం బెట్టర్ 

. వివాహాలు,వేడుకలు మొత్తానికే రద్దు చేసుకొవడం 

. అనవసరమైన ప్రయణాలు చేయకపొవడం 

. సామాజిక దూర నిబంధనలను పూర్తిగా పాటించండి ..

. దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి ..

. బయటకు వెళ్తే ఫేస్ మాస్క్ ధరించడం 

.ఒక ఆరు నెలలు సినిమాలు,షికార్లు, షాపింగ్ మాల్స్ మరియు రద్దిగ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపొవడం 


Other news

More News

-Next--Last