Loading. Please wait.

actress,actors gallery

ఎస్.కోట ఎమ్మెల్యే కే.శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్

6/22/2020
విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కే.శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇటీవలే అమెరికా నుంచి వచ్చారని కరోనా లక్షణాలు ఉండడంతో ట్రూ నాట్ తో పాటు ఆర్డీ ఆర్పీ పరీక్షలు చేసి పాజిటివ్ అని ధ్రువీకరించినట్టు తెలిసింది. ఆయనతో పాటు వున్న గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు.

అయితే, ప్రభుత్వం ఇంకా అధికారికంగా దీనిని ఖరారు చేయలేదు. ఈ వార్త తెలిసి ఏపీ ఎమ్మెల్యేలు అందరూ కంగారు పడుతున్నారు. ఎందుకంటే గత వారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే హాజరవడంతో పాటు మూడు రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటు వేశారు.ప్రస్తుతం ఎమ్మెల్యే వైజాగ్ లోని ఓ గెస్ట్ హౌస్ లో హోమ్ క్వారెంటైన్ లో వున్నారు.

Other news

More News

-Next--Last