Loading. Please wait.

actress,actors gallery

ఇండియన్ నేవి సిబ్బందిలొ 20 మందికి సొకిన కరొనా వైరస్

4/17/2020
ముంబయిలో 26 మంది నేవీ సిబ్బందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో నేవీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబయి డాక్‌యార్డ్‌లోని కనీసం నాలుగు అమెరికా, ఒకటి ఫ్రాన్స్ అణ్వాయుధ విమాన వాహక నౌకల కార్యకలాపాలకు ఇది ప్రతికూలంగా మారింది. పశ్చిమ్ నావెల్ కమాండ్‌ ఐఎన్ఎస్ ఆంగ్రే నౌకలోని లాజిస్టిక్ విభాగం సిబ్బందిలో 26 మందికి వైరస్ నిర్ధారణ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం వీరిని ముంబయిలోని ఐఎన్‌హెచ్ఎస్ అశ్వని హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఒక్కసారిగా 26 మంది వైరస్ నిర్ధారణ కావడంతో వీరితో సన్నిహితంగా ఉన్న సెయిలర్స్‌, ఇతర సిబ్బందిని గుర్తించే ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. వీరందరూ ఐఎన్ఎస్ ఆంగ్రే బ్యాచిలర్ రెసిడెన్షియల్ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. ఈ బ్లాక్‌ను కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారని, ఐఎన్ఎస్ ఆంగ్రేను పూర్తిగా మూసివేశారని తెలిపాయి. ముంబయి నావెల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎ‌స్ ఆంగ్రేతోపాటు పలు యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉంటాయి.

Other news

More News

-Next--Last