పుష్ప మరో నెంబర్ వన్ రికార్డ్.. RRRరికార్డుకు చేరువలో..

ఇక ఇప్పుడు టాలీవుడ్ లోనే అత్యదిక వేగంగా 50మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న టీజర్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. RRR కొమురం భీమ్ టీజర్ ఇటీవల 50మిలియన్ వ్యూవ్స్ ను టచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక దానికంటే వేగంజ్ పుష్ప ఆ రికార్డును అందుకుంది. రేపో మాపో నెంబర్ వన్ స్థానంలోకి రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇక కోవిడ్ కారణంగా సుకుమార్ యూనిట్ కేవలం 50మంది యూనిట్ సభ్యులతోనే షూటింగ్ నిర్వహిస్తోంది. వీలైనంత వరకు వారంలో 4రోజులు మాత్రమే పని చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన సాంగ్స్ పై ఇప్పటికే అనేక రకాల రూమర్స్ మొదలయ్యాయి. మొదటి సాంగ్ ను త్వరలోనే విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే సినిమాలో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫజిల్ ఫస్ట్ లుక్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

Other news