సోనూసూద్‌ కు కరోనా పాజిటివ్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదు. అన్ని వర్గాల వారిని కరోనా ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. నిన్న పవన్‌ కళ్యాణ్ కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది అంటూ వచ్చిన వార్తల నుండి అభిమానులు ఇంకా బయటకు రాకుండానే మరో బ్యాడ్‌ న్యూస్ ను వినాల్సి వచ్చింది. కరోనా పాజిటివ్‌ అంటూ తనకు నిర్థారణ అయ్యింది అంటూ సోనూసూద్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు.

నిన్న మొన్నటి వరకు ఆచార్య సినిమా రెయిన్‌ ఫైట్‌ లో సోనూసూద్‌ పాల్గొన్నాడు. మొన్న సైకిల్‌ పై ఆచార్య సెట్స్ కు వెళ్తున్న వీడియో వైరల్‌ అయ్యింది. ఇంతలో ఆయనకు కరోనా పాజిటివ్‌ అంటూ రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ఆయన లక్షల మందిని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆదుకున్నాడు. అలాంటి సోనూసూద్‌ కు కరోనా రావడంతో అభిమానులు ముఖ్యంగా ఆయన సాయంను పొందిన వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన మాత్రం ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉంది ఆందోళన అక్కర్లేదు అంటూ తన హెల్త్‌ బులిటెన్ ను స్వయంగా విడుదల చేయడం జరిగింది.

Other news