వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రముఖ తమిళ హాస్య నటుడి వివేక్ కి గుండె పోటు

తమిళ ప్రముఖ నటుడు వివేక్ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆయన గురువారం ఉదయం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల అనారోగ్య సమస్యలు సాదారణంగా వస్తాయి. కాని అనూహ్యంగా వివేక్ కు గుండె పోటు వచ్చింది. వ్యాక్సిన్‌ వల్లే గుండె పోటు వచ్చిందని ఆయన కుటుంబ సభ్యులు నమ్ముతున్నారట. ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. కాని వివేక్ మాత్రం ఆసుపత్రిలో ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నాడని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
నేడు ఉదయం వరకు కూడా ఆయన పరిస్థితిపై వైధ్యులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కాని తాజాగా ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారట. గుండె పోటుకు కారణం ఏంటీ అనేది విశ్లేషిస్తున్నట్లుగా చెబుతున్నారు. కనీసం రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత ఆసుపత్రి నుండి వెళ్లవచ్చు అంటూ వైధ్యులు చెప్పారనే వార్తలు వస్తున్నాయి. వివేక్ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ కమెడియన్‌ గా గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. అలాంటి కమెడియన్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Other news