మీ గుండెల్లో చోటు దక్కించుకోనున్న అది చాలు : పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ‌.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ టాప్‌ హీరాగా దూసుకుపోతున్నారు. మొదట్లో చిరంజీవి సోదరుడిగానే అందరికీ కనిపించిన పవన్‌ ఆ తరువాత.. తనకంటూ సూపర్ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. పవన్‌ యాక్టింగ్‌లోనే కాదు.. డ్యాన్స్‌ల్లోను.. ఫైట్లలోనూ.. తనకే సాధ్యం అయిన స్టైల్‌తో.. యాటిట్యూడ్‌తో మెగా ఫ్యాన్సందరినీ మెస్మరైజ్‌ చేసి.. తరిగిపోని తిరుగులేని క్రేజ్‌ని తరిగిపోని అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. “అజ్ఙానతవాసి” సినిమా తరువాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి, రాజకీయా పార్టీ పెట్టిన పవన్‌.. ఆ తరువాత అభిమానుల కోరిక మేరకు తిరిగొచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తరువాత ఓ మాంచి సినిమాతో వెండి తెరపై మెరవబోతున్నాడు. అలా ఒక సినిమాతో మెరవడమే కాదు.. వరుసగా యంగ్ అండ్ క్రేజీ డైరెక్టర్లకు ఓకే చెబుతూ.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.పింక్‌ రిమేక్‌గా తెరకెక్కుతున్న వకీల్‌ సాబ్‌ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్‌ చేస్తుండా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో… కోర్టులో దోషులుగా మగ్గురు మగువలు నివేతా థామస్‌, అంజలి, అనన్య నాగల్లి నటించారు. ప్రకాశ్‌ రాజ్‌ డిఫెన్స్‌ లాయర్‌ నందాగా నటించాడు. ఇక వీరితో పాటు సీనియర్‌ యాక్టర్‌ నరేష్, ముఖేష్‌ ఋషి, సుబ్బరాజు, దేవ్‌ గిల్‌, అనసూయలు నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది.

మీ గుండెల్లో చోటు దక్కించుకోనున్న అది చాలు : పవన్
మా అన్నయ చెప్పిన ఒక్క మాట నన్ను నటుడిని చేసింది. నేను చదువును వదిలేసిన వ్యక్తిని కానీ నేను పుస్తకాలు చదువుతాను.. నాకు తెలిసిన వకీల్ సాబ్ ‘నాని పల్కి వాలా’. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్న సమయంలో పోరాడిన వ్యక్తి. ఆయన గురించి చదివిన తర్వాత లాయర్ వృత్తిపై గౌరవం పెరిగింది. మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులపైనా నాకు అపారమైన గౌరవం ఉంది. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా.. అమితాబ్ కు నేను పెద్ద అభిమానిని ఆయన పాత్ర నేను చేస్తా అనుకోలేదు.. నా ప్రతి సినిమాలో సామాజిక స్పృహ ఉండేలా చూసే వ్యక్తిని నేను. నా సినిమలో అలాంటివి చాలా ఉన్నాయి. సినిమాలో ఐటమ్ సాంగ్స్ బదులు దేశభక్తి సాంగ్స్ చేయడానికి ఇష్టపడేవాడినినేన.. అలా అని నేను ఐటమ్ సాంగ్స్ ను తప్పు అనను. స్త్రీలను గౌరవించే నాకు ఈ వకీల్ సాబ్ సినిమాను ఆడపడుచులందరికి గౌరవంలో భాగంగా ఈ సినిమాను అందిస్తున్నాం. మేము షూటింగ్స్ చేసే సమయంలో మా చుట్టూవున్న ఆడవాళ్లను ఏడిపించేవారు..ఆ సమయంలో నేను కర్ర పట్టుకొని బయటకు వెళ్ళేవాడిని అన్నారు పవన్. లాయర్ గా ప్రకాష్ రాజ్ గారు సినిమాకు వన్నె తెచ్చారు. నా పర్ఫామెన్స్ బాగుంది అంటే అది ప్రకాష్ రాజ్ గారు వల్లే. రాజకీయాల పరంగా మా దారులు వేరైనా. సినిమాపరంగా ఆయనంటే నాకు చాలా ఇష్టం అన్నారు. మీరు లేక పోతే పవన్ కళ్యాణ్ లేడు అంటూ అభిమానులను ఉద్దేశించి అన్నారు పవన్. నేను సినిమా చేస్తే ప్రత్యేక్షంగా 300 మంది బ్రతుతారు. పరోక్షంగా మరో 500 మంది బ్రతుకుతారు అందుకోసం నేను సినిమాజ చేస్తా.. సినిమా అనేది.. చేసే పని పైన ప్రేమ ఉంటే సినిమా తప్పకుండ విజయం సాధిస్తుంది. అలాంటి దర్శకులంటే నాకు చాలా ఇష్టం.

సీఎం అంటే అది జరగాలి అనుకుంటే అవవలేం.. మీ గుండెల్లో స్థానం సంపాదిస్తానని అనుకోలేదు కానీ సాధించా.. పదవి కోసం నేను వెంపర్లాడను. మీ గుండెల్లో చోటు దక్కించుకోనున్న అది ఈ జీవితానికి చాలు అన్నారు పవన్

నాకు సినిమాలు కావాలని నేను ఎవ్వరిని యాచించలేదు : పవన్
ఏ వృత్తి ఎక్కువ కాదు ఏ వృత్తి తక్కువ కాదు.. నాకు చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్లంటే చాలా ఇష్టం అన్నారు పవన్. నేను కోరుకున్నది నా జీవితం లో జరగలేదు. నేను ఒక దిగువ మధ్య తరగతి జీవితాన్ని గడుపుదామనుకున్న అది తప్ప అన్ని జరిగాయి నాజీవితంలో అన్నారు పవన్. అలాగే నేను సినిమాలు కావాలని నాకు సినిమా చేయండి అని ఎవ్వరిని యాచించలేదు అన్నారు పవన్

Other news