ప్రభాస్@రూ.100 కోట్లు?

అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే బడా హీరోలు. ఈ జాబితాలోకి తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేరాడట. దక్షిణాది నుంచి ఈ రేంజ్ పారితోషికం అందుకుంటున్న నటుడిగా నిలిచాడట. నిజానికి పైన చెప్పిన బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిన అంత పెద్ద మార్కెట్ లేదు. కానీ, ప్రభాస్‌కు `బాహుబలి` కారణంగా దక్షిణాదిన ప్రతి రాష్ట్రంలోనూ, ఉత్తరాదిన మార్కెట్ ఏర్పడింది. 

ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో మూడు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. `రాధేశ్యామ్` తర్వాత అంగీకరించిన సినిమాలన్నింటికీ ప్రభాస్ రూ. వంద కోట్ల రేంజ్‌లోనే పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. `రాధేశ్యామ్` కనుక దేశవ్యాప్తంగా విజయవంతమైతే ప్రభాస్ పారితోషికం మరింత పెరగవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Other news