`ఉప్పెన` జోడీకి భారీ గిఫ్ట్స్?

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి షెట్టి. వైష్ణవ్, కృతి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన `ఉప్పెన` చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. వంద కోట్ల రూపాయల కలెక్షన్లకు చేరువలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్లకు మైత్రీ నిర్మాణ సంస్థ నగదు బహుమతులు అందించిందట. 

హీరో వైష్ణవ్‌ తేజ్‌కి కోటి రూపాయలు.. హీరోయిన్‌ కృతికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. కాగా, తొలుత ఈ సినిమా పారితోషికంగా వైష్ణవ్‌కు రూ.50 లక్షలు, కృతికి రూ.10 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా విజయం కారణంగా అటు వైష్ణవ్, ఇటు కృతి వరుస అవకాశాలు అందుకుంటున్నారు. కాగా, ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబుకు కూడా కోటి రూపాయల విలువైన బహుమతిని మైత్రీ అధినేతలు ఇవ్వబోతున్నారని సమాచారం. 

Other news