‘Naandhi’ movie Box Office Collections
కలెక్షన్స్ పరంగా నాంది దూసుకుపోతుంది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. మూడో రోజుకు గాను 1.91 కోట్ల గ్రాస్, 1.04 కోట్లు షేర్ రాబట్టి సత్తా చాటింది ఈ సినిమా. మూడురోజులకు గాను నైజాం- 93 లక్షలు, సీడెడ్- 29 లక్షలు, ఉత్తరాంధ్ర- 19 లక్షలు,ఈస్ట్ గోదావరి- 16 లక్షలు, వెస్ట్ గోదావరి- 12 లక్షలు, గుంటూరు- 17 లక్షలు, కృష్ణా- 18 లక్షలు, నెల్లూరు- 10 లక్షలు వాసులు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.86 కోట్ల గ్రాస్, 2.14 నెట్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 4.05 కోట్ల గ్రాస్, 2.28 కోట్ల షేర్ వసూల్ చేసింది నాంది. కాగా సుడిగాడు చిత్రం తర్వాత అల్లరి నరేష్‌కు నాంది చిత్రం మంచి విజయాన్ని అందించింది. చాలా కాలం తర్వాత సక్సెస్‌ని చవి చూడడంతో నరేశ్ సంతోషంలో మునిగిపోయాడు.