శంకర్-రామ్‌చరణ్: తెర పైకి రష్మిక మందన్న, అనిరుధ్?

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న చరణ్ ఆ తర్వాత సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు ఇది 50వ చిత్రం. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే దీని గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన కథానాయికగా కన్నడ భామ రష్మికా మందన్నను తీసుకోవాలనుకుంటున్నారట. రష్మికకు దక్షిణాదిన అన్ని భాషల్లోనూ క్రేజ్ ఉంది. అలాగే `మిషన్ మజ్ను` సినిమాతో హిందీలోకి కూడా అరంగేట్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని భాషల వారికి తెలిసిన రష్మికనే కథానాయికగా ఎంపిక చేయాలని శంకర్ అనుకుంటున్నారట. ఇక, ఈ సినిమా సంగీత బాధ్యతలను అనిరుధ్‌కు అప్పగిస్తున్నారట. 3డీ ఫార్మాట్‌లో అత్యంత భారీగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. 

Other news