`ఉప్పెన` దర్శకుడికి ఖరీదైన బహుమతి?

తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. 

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాల రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తోంది. తమకు భారీ హిట్ అందించిన డైరెక్టర్ బుచ్చిబాబుకు మైత్రీ సంస్థ అధిపతులు ఓ ఖరీదైన బహుమతిని ఇవ్వబోతున్నారట. కోటి రూపాయల విలువైన బహుమతి అందించనున్నారట. దర్శకుడి ఇష్టం మేరకు ఇల్లు లేదా కారు కొనివ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా కొరటాల శివ, వెంకీ కుడుముల, మారుతి వంటి దర్శకులు ఇలాంటి బహుమతులను అందుకున్న సంగతి తెలిసిందే.  

Other news