తొలి రోజు అదరగొట్టిన `రెడ్`!

రామ్ నటించిన తాజా చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ సంస్థ నిర్మించింది. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తొలి రోజు ఈ సినిమా అదరగొట్టింది. టాక్‌తో సంబంధం లేకుండా భారీ పోటీ మధ్య మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమా తొలి రోజు రూ.6.7 కోట్ల షేర్ రాబట్టింది. వీకెండ్ కావడంతో ఈ సినిమా భారీగానే వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Other news