Loading. Please wait.

actress,actors gallery

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమనూ పట్టిపీడిస్తోంది. ఇటీవల ఇద్దరు అగ్ర దర్శకులకు.. గాయని స్మితకు కరోనా సోకగా.. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలుకి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. తనకు కరోనా సోకిందని అయినా.. చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ బాలు ఓ వీడియో విడుదల చేశారు.

మూడు రోజులుగా అస్వస్థతగా ఉండటంతో ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు ఎస్పీ బాలు చెప్పారు. కరోనా పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, మందులు ఇచ్చి హోంక్వారంటైన్‌లో ఉండమని వైద్యులు సూచించినట్లు చెప్పారు. అయితే కుటుంబసభ్యులను ఇబ్బందుల్లో పడేయటం ఇష్టంలేక ఆస్పత్రిలో చేరినట్లు ఎస్పీ బాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తనను పరామర్శించేందుకు చాలా మంది ఫోన్‌ చేస్తున్నారని చెప్పారు. వారితో మాట్లాడే పరిస్థితిలో లేనని, విశ్రాంతి తీసుకోవడానికే ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.  కేవలం జలుబు, జ్వరంతో బాధపడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం జ్వరం కూడా తగ్గిందని మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్తానని ఎస్పీ బాలు చెప్పారు

Other news