Loading. Please wait.

actress,actors gallery

AA 21: అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ సినిమా

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబోలో సినిమా రాబోతోంది. అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ సినిమాను తెరకెక్కించబోతున్నారు. AA 21గా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు ఓ బ్లాక్ అండ్‌ వైట్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందులో అల్లు అర్జున్ మరో వ్యక్తితో ఉండగా..  గ్రామీణ నేపథ్యాన్ని తలపించే విధంగా లాంతర్‌, బోటు లాంటి వస్తువులు ఉన్నాయి. అంతేకాదు ఓ గ్రామానికి దూరంగా వారిద్దరు నిల్చున్నట్లు చూపించారు. దీన్ని బట్టి చూస్తేంటే.. రంగస్థలం తరహాలో ఇది కూడా పీరియాడిక్‌ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక యువసుధ ఆర్ట్స్‌, జీఏ 2 పిక్చర్స్ సంయుక్త నిర్మాణంపై సుధాకర్‌ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాండీ స్వాతి నట్టీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మల్టీలింగ్వల్‌ మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీ 2022లో ప్రారంభంలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. త‌న 21వ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం ఆనందంగా ఉంద‌ని. ఈ సినిమా కోసం కొంత‌కాలంగా వెయిట్ చేస్తున్నానని వెల్లడించారు. కాగా ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటించనుండగా.. మరోవైపు చిరంజీవి హీరోగా కొరటాల ఆచార్యను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లో పూర్తి అయిన తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Other news