Loading. Please wait.

actress,actors gallery

రేసుగుర్రం, కిక్‌-2 ఫేం కిక్‌ శ్యామ్‌ అరెస్టు

ప్రముఖ సినీనటుడు కిక్‌ శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. కోడంబాక్కంలో పోకర్‌ క్లబ్‌ నడుపుతున్న శ్యామ్‌.. గ్యాంబ్లింగ్‌ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగ్‌లు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కిక్‌ శ్యామ్‌ తెలుగు, తమిళ సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్‌, ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్‌-2 చిత్రాల్లో నటించారు. ఎక్కువగా దర్శకుడు సురేందర్‌రెడ్డి సినిమాల్లో కనిపించారు. కిక్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ఆకట్టుకుని టాలీవుడ్‌లో కిక్‌ శ్యామ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Other news