Loading. Please wait.

actress,actors gallery

''అమృతరామమ్‌'' ఫస్ట్ లుక్ రిలీజ్

12345
రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్‌ జంటగా  సురేందర్ కొంటాడ్డి దర్శకత్వంలో
రూపొందిన సినిమా "అమృత రామమ్". ‘‘దేర్‌ ఈజ్‌ నో లవ్‌ విత్ ఔట్‌ పెయిన్‌’’
అనేది ట్యాగ్ లైన్. యస్.ఎన్ రెడ్డి నిర్మాత.  ఒక గాఢమైన ప్రేమకథగా
ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ
నిర్మాత మధురా శ్రీధర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ కొంటాడ్డి మాట్లాడుతూ.. "ప్రేమలోని గాఢతను
ఈ కథతో చెప్పబోతున్నాం. ఈ ప్రేమకథలో పాటలు హైలెట్‌గా నిలవబోతున్నాయి.
ఎన్.ఎస్ ప్రసు అందించిన స్వరాలు ఈ కథలోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేశాయి.
ఈ మధ్య లవ్ అనేది ఆప్షన్‌గా చాలా మంది చూస్తున్నారు. కానీ, ఈ ప్రేమకథలో
ఆప్షన్స్  కనపడవు.హీరోయిన్ అమిత, హీరో రామ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం
చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
త్వరలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.

Other news