Loading. Please wait.

actress,actors gallery

వేణు మాధవ్ కన్నుమూత..

ప్రముఖ సినీ నటుడు వేణు మాధవ్ కన్ను మూశారు.అనారొగ్యంతొ సికింద్రాబాద్‌ లొని యశొద ఆసుపత్రిలొ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో ఈ నెల 6వ తేదిన ఆసుపత్రిలొ చేరారు.. మంగళవారం ఆయన ఆరొగ్య పరిస్తితి విషమించడం తొ వెంటిలేటర్ పై వైద్యం అందిస్తూ వచ్చారు..అయినా ఆరొగ్యం క్షీణించి ఈరొజు ఉదయం తుది శ్వాస విడిచారు..   అయితే వేణు మాధవ్‌ చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో నిన్నటి నుంచే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే వాటిని కుటుంబసభ్యులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. వేణు మాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది నెలల క్రితం వేణు మాధవ్‌ సోదరుడు విక్రమ్‌ బాబు గుండెపోటుతో మృతి చెందారు.

Other film news