Loading. Please wait.

actress,actors gallery

యూత్ ను ఆకట్టుకుంటొన్న "కెఎస్100" చిత్రం

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం
లో రాబోతున్న చిత్రం "కెఎస్100". చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్
రెడ్డి ఈ సినిమా ను నిర్మించారు.. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతాన్ని,
భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు..  జులై 5న విడుదలైన ఈ సినిమా యువ
ప్రేక్షకుల ఆదరణను ఆందుకుంది‌.

ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 12 న
ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాము. యూత్ ఎక్కువగా మా సినిమాను
ఇష్టపడుతున్నారు.నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అన్నారు.
‌నన్ను,నా సినిమాను  ఆదరించినందుకు ధన్యవాదాలన్నారు.

చిత్ర దర్శకుడు షేర్  మాట్లాడుతూ " కెఎస్100" సినిమా వెనుక మా కష్టం చాలా
ఉంది. విడుదలై మా కష్టానికి  తగ్గ ప్రతిఫలం‌ లభించింది. చిన్నగా విడుదలై
సైలెంట్ హిట్ అయింది. మా టీమ్ అందరు మంచి పొజిషన్స్ కు వెళ్లాలన్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ "కెఎస్100" చిత్రం  జులై 12
న  దాదాపు 200 థియేటర్స్ లో  రిలీజ్ అయి యూత్ ను ఆకట్టుకుంటొంది...
అన్నింటిలోనూ ఆడుతోంది.
ఒక మంచి ట్రెండీ  సినిమా తీస్తే ఎలా ఉంటుందొ మా సినిమా నే ఉదాహారణ.
డైరెక్టర్ షేర్ మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు   మెసేజ్ మా సినిమా ద్వారా
ఇచ్చారన్నారు.

Other film news