Loading. Please wait.

actress,actors gallery

మాసివ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా పారిజాత‌ మూవీ క్రియెష‌న్స్ చియాన్ విక్ర‌మ్ న‌టించిన "మిస్ట‌ర్ కెకె"

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సోంతం
చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్
కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో త‌మిళం లో రాజ్‌క‌మ‌ల్
ఫిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ నిర్మాణం లో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.ర‌విచంద్ర‌న్
బ్యాన‌ర్ పై రూపోందిన క‌ద‌ర‌మ్ కొండ‌న్ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత‌లు
టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ లో
ఉత్త‌మాభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ పై
విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా థ్రిల్
ని అందించే విధంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు.  ఈ చిత్రానికి తెలుగు లో
మిస్ట‌ర్ కెకె అనే టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే సోష‌ల్ మీడియా నుండి
సామాన్య ప్రేక్ష‌కుడి వ‌ర‌కూ హ్యూజ్ రెస్పాన్స్ రావ‌టం తో ట్రేడ్ లో ఈ
సినిమా పై భారీ అంచ‌నాలు పెరిగాయి. అయితే ఈ రోజు మిస్ట‌ర్ కెకె ట్రైల‌ర్
ని విడుద‌ల చేశారు. లోక‌నాయ‌కుడు ప‌ద్మ‌భూషణ్ శ్రీ క‌మ‌ల్‌హ‌స‌న్ గారు
త‌మిళ ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌గా, అక్ష‌ర హ‌స‌న్ తెలుగు వెర్ష‌న్
ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు
పూర్తిచేసి జులై లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు
చేస్తున్నారు..

Other film news