Loading. Please wait.

actress,actors gallery

భ‌వ్య క్రియేష‌న్స్ నిర్మించిన‌`ఓ పిట్టక‌థ‌` టైటిల్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన త్రివిక్ర‌మ్‌

కొన్ని క‌థ‌లు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. అతి త‌క్కువ నిడివితో  పెద్ద పెద్ద విష‌యాల‌ను చెబుతుంటాయి. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టక‌థ‌లు అంటుంటారు. అలాంటి ఓ ఇంట్ర‌స్టింగ్ పిట్టక‌థ‌ను సెల్యులాయిడ్ మీద చూపించ‌బోతోంది భ‌వ్య క్రియేష‌న్స్.  భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కి కేరాఫ్‌గా నిలిచే భ‌వ్య క్రియేష‌న్స్ తాజాగా తెర‌కెక్కించిన క్యూట్ క‌థకు `ఓ పిట్టక‌థ‌` అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం టైటిల్ పోస్ట‌ర్ ని  మాట‌ల మాంత్రికుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ విడుద‌ల చేశారు. చెందు ముద్దు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
`ఓ పిట్టక‌థ‌` గురించి త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ ``ఈ సినిమాతో నాకు ఒక లింకు ఉంది. అదేంటంటే నాకు ఈ క‌థ తెలియ‌డ‌మే. క‌థ విన్న‌ప్పుడు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ ఉంటే బావుంటుంద‌నే డిస్క‌ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు, ద‌ర్శ‌కుడు చందు రెండు, మూడు టైటిల్స్ చెప్పారు. అందులో `ఓ పిట్టక‌థ‌` నాకు చాలా బాగా న‌చ్చింది ఈ టైటిల్‌.  `ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ` అనే క్యాప్ష‌న్ పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చాను. అంత‌వ‌ర‌కే నా కంట్రిబ్యూష‌న్‌. క‌థ న‌చ్చింది. టైటిల్ బావుంది. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఈ టైటిల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి ఒప్పుకున్నాను`` అని చెప్పారు.

న‌టీన‌టులు
  విశ్వంత్ దుద్దుంపూడి, సంజ‌య్‌రావు, నిత్యాశెట్టి, బ్ర‌హ్మాజీ, బాల‌రాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భ‌ద్రాజీ, ర‌మ‌ణ చ‌ల్క‌ప‌ల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి త‌దిత‌రులు 

Other news