Loading. Please wait.

actress,actors gallery

బయ్యర్లను నిండా ముంచిన సైరా!

బయ్యర్లను నిండా ముంచిన సైరా!

భారీ అంచనాల మధ్య 250-300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సైరా సినిమా,తెలుగు,తమిళ,మలయాళం,కన్నడ మరియు హింధీ భాషలతో కలిపి 200 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది.ఐతే అంచనాలకు అణుగునంగ పాజిటివ్ టాక్ వచ్చినా,వసూళ్ళ దగ్గర కొద్దిగ తడబడిందనే చెప్పాలి.తెలంగాణ,ఆంధ్ర మినహా మిగతా అన్ని ఏరియాల్లొ వసూళ్ళ పరంగ ఫ్లాప్ టాక్ ని మూట గట్టుకుంది సైరా సినిమా.సినిమా విడుదల అయి ఇప్పటికి 17 రొజులు అయింది.ఇప్పటి వరకు వచ్చిన వసూళ్ళు చూస్తే నిరాశజనకంగ ఉన్నాయి అనే చెప్పాలి.ఇంకా వస్తాయి అనే ఆశ వదులుకొనే పరిస్తితి నిర్మాత రాం చరణ్ ది.చెప్పాలంటే జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగిపొయింది.కొలుకునే పరిస్తితి ఇక లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు హిందీ లొ రమారమి 6 కోట్లు,కర్ణాటక-14 కోట్లు, తమిళనాడు-1.5 కోట్లు,కేరళ-75 లక్షల వసూళ్ళు రాబట్టింది. అయితే తెలంగాణ,అంధ్ర రాష్ట్రాలు  కలిపి 115 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. అయితే ఆ లెవల్లో వసూళ్ళు వచ్చాయా అంటే,దానికి సమాధానం నిర్మాతనే చెప్పాలి.

ఇప్పటి వరకు 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగ 140 కోట్ల (240 కోట్ల,గ్రాస్)  వసూళ్ళు మాత్రమే సైరా సాదించింది.అంటే 60 కోట్ల డెఫిసిట్ తొ సినిమా ముగుస్తుందా అంటే అవును నిజమే అనీ పరిస్తితి సైరా సినిమాది..అది కాదనుకుంటే, ఈ మధ్య ఏ భారీ సినిమా రిలీజులు లేవు కాబట్టి (రాజు గారి గది-3 మినహా) ఇంకా 5-6 కోట్ల వసూళ్ళు సాదించొచ్చు అని ట్రేడ్ వర్గాల అంచన.
ఏది ఏమైన సైరా సినిమా,మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్ని నిరాశ పరిచింది అనే చెప్పాలి.

Other film news