Loading. Please wait.

actress,actors gallery

ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 టీం తో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ డిస్కో రాజా యాక్షన్ ఎపిసోడ్స్

మాస్ మహారాజ్ రవి తేజ హీరో గా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతకం పై టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిస్కో రాజా. ప్రముఖ నిర్మాత రామ్ తళ్ళూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.డిసెంబర్ 20న డిస్కో రాజా విడుదల కాబోతుంది. ఇక బడ్జెట్ విషయం లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా  ఈ సినిమాను చిత్రీకరిస్తున్న చిత్ర బృందం,  తాజాగా గోవా లో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొని వచ్చింది. మాస్ మహారాజ్ రవి తేజ కెర్రిర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గా డిస్కో రాజా టీం చెబుతుంది. ఈ నేపథ్యంలో గోవ షెడ్యూల్ ముగించుకొని ప్రస్తుతం ఫారిన్ వెళ్లేందుకు డిస్కో రాజా టీం రెడీ అవుతున్నట్లు నిర్మాత రామ్ తళ్ళూరి తెలిపారు. యూరోప్ లోని ఐస్ ల్యాండ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించాడనికి ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ షెడ్యూల్ కోసం భారీ గా ఖర్చు చేస్తున్నట్లు గా డిస్కో రాజా టీం చెబుతుంది.

నాలుగు  నిముషాల సన్నివేశం కోసం 4 - 5 కోట్ల ఖర్చు 

ఐస్ ల్యాండ్ లో షూట్ చేయబోతున్న కొన్ని కీలక సన్నివేశాల కోసం ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు భారీ గా ఖర్చు చేయబోతున్నారు. నిర్మాత రామ్ తళ్ళూరి దర్శకుడు వి ఐ ఆనంద్ విజన్ కి తగినట్లుగా బడ్జెట్ విషయం లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిస్కో రాజా ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఐస్ ల్యాండ్ లో సెప్టెంబర్ 17 నుంచి జరగబోతున్న షెడ్యూల్ ని  దాదాపు 4 - 5 కోట్ల రూపాయలు బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ కీలక సన్నివేశం డిస్కో రాజా సినిమా లో కేవలం నాలుగు  నిముషాల నిడివి మాత్రమే ఉండటం కొస మెరుపు.

డిస్కో రాజా కోసం ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 టీం 

ఐస్ ల్యాండ్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో హాలీవుడ్ బ్లాక్  బస్టర్ ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, అలానే పలు ఇంటర్నేషనల్ సినిమాలకు పనిచేసిన ఊలి టీం  డిస్కో రాజా కోసం రంగం లోకి దిగబోతున్నారు. సినిమా కి హైలైట్ గా ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని డిస్కో రాజా టీం చెబుతుంది. 

Other news