Loading. Please wait.

actress,actors gallery

పాటల మినహా పూర్తయిన"అమ్మ దీవెన"

123
అమ్మతోనే పుట్టుక ప్రారంభం, అమ్మనే సృష్టికి మూలం,అమ్మ లేని లోకం
చీకటిమయం అవుతుందంటూ మాతృమూర్తి పై ప్రేమతో లక్ష్మమ్మ ప్రొడక్షన్స్
పతాకంపై శివ ఏటూరి దర్శకత్వంలో ఎత్తరి గురవయ్య నిర్మిస్తున్న చిత్రం
"అమ్మ దీవెన". ఈ నెల 17 వ తేదీ నుండి చివరి షెడ్యూల్ జరుపుకోబోతున్న ఈ
చిత్రం మాతృదినోత్సవ సందర్భంగా ఆడపిల్లలంటే అమ్మతో సమానం, అమ్మ బాగుంటే
లోకమంతా బాగుంటుందంటూ ప్రతి తల్లీ గర్వపడేలా అమ్మ గొప్పదనం గురించి
తేలియజేస్తూ భావోద్వేగాలతో నిర్మిస్తున్నామని ఈ చిత్రాన్ని ప్రతి తల్లికి
అంకితం చేస్తున్నామని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ప్రజలందరికీ
మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.


దర్శకుడు మాట్లాడుతూ... అమ్మ దీవెన చిత్ర కథ మా నిర్మాత జీవితంలో జరిగిన
కథ. మాతృమూర్తుల గొప్పతనం చెలియజేసెలా ఉంటే చిత్రమిది. ఆమని ,పోసాని గారి
నటన ఆకట్టుకుంటుంది. టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. చివరి షెడ్యూల్ లో
పాటలు చిత్రీకరణ చెస్తాం.‌ త్వరలొ ఫస్ట్ లుక్ ను విడుదల చెస్తామన్నారు.


ఈ చిత్రానికి కధ: ఎత్తరి చిన మారయ్య, మాటలు శ్రీను.బి, సంగీతం:
ఎస్.వి.హెచ్, కెమెరా సిద్ధం మనోహర్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పవన్,
ఎడిటర్ :జెపి, డాన్స్ గణేష్ స్వామి & నాగరాజు,ఫైట్స్ నందు, పి.ఆర్‌.ఓ:
సాయి సతీష్, నిర్మాత: ఎత్తరి గురవయ్య, దర్శకత్వం: శివ ఏటూరి.‌

Other film news