Loading. Please wait.

actress,actors gallery

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో..డిస్కో రాజా సాంగ్ కి అనూహ్యమైన స్పందన

1234
మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  వి ఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో S. P. బాల సుభ్రమణ్యం పాట పాడారు.. ఈ సాంగ్ పూర్తిగా రెట్రో ఫీల్ ని కలిగిస్తుంది..ఈ సాంగ్ లో లిరిక్స్ చాలా వాల్యూ తో కూడినవిగా విన్నవారంతా చెప్పటం విశేషం..అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తారు.. 
సాంగ్ లిరిక్:
పల్లవి:
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో !
బదులేదో ఎం చెప్పాలో ఏమనుకున్నానో !!
భాషంటూ లేని భవాలేవో నీ చూపులో చదవనా !
స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా !!
ఎటు సాగాలో అడగని ఈ గాలితో !
ఎపుడాగాలో తెలియని వేగాలతో !!
చరణం 1:
నీలాల నీ కనుపాపలో యె మేఘసందేశమో
ఈనాడిలా సావాసమమై అందింది నీ కోసమే 
చిరునామా లేని లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్లకి
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం తీర్చేసావేమో ఈ నాటికి
మౌనరాగాలు పలికే స్వరగాలతో మందహసాలు చిలికే పరాగలతో
భాషంటూ లేని భవాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసును తాకేనా 
చరణం 2:
నీ కురులలో ఈ పరిమళం నన్నళ్ళుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నన్నేను మరిచేంతగా
రెప్పల్లో మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మొహాల భారంతో స్వప్నలెన్నెన్నో కని పెంచుదాం
మంచు తెరలన్ని కరిగించు ఆవిర్లతో హాయిగా అలసిపోతున్న ఆహాలతో 
భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా
న‌టీన‌టులు 
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

Other news