Loading. Please wait.

actress,actors gallery

దొరసాని కోసం ఎదురుచూసాను... శివాత్మిక రాజశేఖర్

1234
ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర
ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ
‘దొరసాని’ జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈమూవీ ట్రైలర్, పాటలతో

ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన ముద్రను వేసింది. కె.వి.ఆర్. దర్శకునిగా
పరిచయం అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. దొరసాని
 ప్రమోషన్స్ లో బాగంగా ఈ రోజు మీడియా తో ముచ్చటించారు హీరోయిన్ శివాత్మిక


సినిమా తోనే పెరిగాను :
షూటింగ్స్ అనేవి నా ఊహా తెలిసినప్పటినుండి నా జీవితంలో బాగం అయ్యాయి.
స్కూల్ కన్నా ఎక్కవుగా షూటింగ్ లోనే టైం స్పెండ్ చేసేదానిని. నేను
హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా సర్ ప్రైజ్ అవలేదు.
కానీ

దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందండి ఎక్కువవుతుంది.
నేనూ దొరసాని కోసం ఎదురుచూసాను:
ఈ కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ
క్యారెక్టర్ ని వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం
నాలుగు గంటల సేపు కథ చెప్పారు.
ఆ తర్వాత ఆడిషన్స్ నన్ను ఆనంద్ ని కలిపే చేసారు.  ఆడిషన్స్ కూడా అయ్యాక
రెండు నెలలు  నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైం లో ఆ పాత్ర  కోసం నేను
ఎదురుచూసాను.
నేనే అని తెలిసాక  చాలా ఎగ్జైట్ అయ్యాను.

పాత కొత్త ఫీల్ ప్రేమ కథలకు ఉండదు:
పాత, కొత్త అలాంటి తేడాలు ప్రేమకథలకు ఉండవు అని నేను నమ్ముతాను. మోడ్రన్
గాళ్ గా కనిపించాలని అనుకోలేదు. పిరియాడిక్ మూవీస్ అంటే బాగా ఇష్టపడతాను.
ఈ ప్రేమకథ లో కనిపించే స్వచ్ఛత నన్ను బాగా ఆకర్షించింది. అందుకే నేను
చాలా ఇష్టపడి చేసాను. నేను సంజయ్ లీలా బన్సాలి  సినిమాలకు పెద్ద ఫ్యాన్.
అలాంటి కథతోనే ఇంట్రడ్యూస్ అవడం చాలా ఆనందంగా ఉంది.


Other film news