డిసెంబర్ 27న వస్తున్న `ఎర్రచీర`
డిసెంబర్ 27న వస్తున్న `ఎర్రచీర`.. నేడు శివ శివ శంభో శంకర గీతావిష్కరణ
సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢమరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం `ఎర్రచీర`. సి.హెచ్ సుమన్ బాబు స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారి. మహానటి ఫేం బేబి సాయి తేజస్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజనా శెట్టి, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివ శివ శంభో శంకర అనే పాట కార్తీక పౌర్ణమి సందర్భంగా నేడు రిలీజైంది. ఈ పాటకు ప్రమోద్ సంగీతం అందించగా .. బాలవర్ధన్ సాహిత్యం అందించారు. జె. శ్రీనివాస్ ఆలపించారు.