Loading. Please wait.

actress,actors gallery

జులై 5 న విడుదల కానున్న "కెఎస్100" చిత్రం

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం
లో రాబోతున్న చిత్రం "కెఎస్100"..    చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్
రెడ్డి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన  ఫస్ట్ లుక్
కి మంచి స్పందన రాగ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచింది.. ఈ చిత్రానికి
నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు..
ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ దక్కించుకోగా జులై 5 న
సినిమా ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు..

ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 5 న
ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. చాలామంది ఈ సినిమా కోసం
ఎదురుచూశారు..నా సోషల్ మీడియా లో ఎప్పుడు రిలీజ్ అని అడిగారు..
సినిమాకోసం వెయిట్ అందరికి చాల థాంక్స్.. తప్పకుండా అందరు ఈ సినిమా ను
ఆదరించండి..  అన్నారు..

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ " కెఎస్100" చిత్రం జులై 5 న రాబోతుంది..
చిత్రం రిలీజ్ లేట్ అయినా ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నా..
ప్యూర్ ఫ్యామిలీ సినిమా.. ప్రతి సీన్ లో ఒక మెసేజ్ ఉంది.. ప్రతి ఒక్కరు
మనమే గొప్ప అనే ఫీలింగ్ ని తగ్గిస్తుంది.. తప్పకుండా ఈ సినిమా అందరిని
మెప్పిస్తుంది.. సాంగ్స్, ట్రైలర్ ద్వారా మంచి క్రేజ్ ఉంది.. ఆ క్రేజ్ ని
ఈ సినిమా మరింత పెంచుతుంది.. అన్నారు.

Other film news