Loading. Please wait.

actress,actors gallery

ఔరంగాబాద్ పారిశ్రామికవేత్తతో కాజల్ అగర్వాల్ పెళ్లి..!

ఔరంగాబాద్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పుడో వార్త తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహానికి సంబంధించి ఇరు వర్గాల కుటుంబసభ్యులు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా సమాచారం. మరి ఈ వార్తలపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాగా ఆ మధ్యన లక్ష్మీ మంచుతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్.. తన పెళ్లిపై మాట్లాడింది. ఎలాంటి వాడు కావాలి అన్న లక్ష్మి ప్రశ్నకు.. బాగా చూసుకునేవాడు, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వాడు తనకు కావాలని కాజల్ చెప్పిన విషయం తెలిసిందే.

Other news